మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని అమెరికాలో గాంధీజీకి ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన అహింస, శాంతి, సహనం వంటివి బహుశా గతంలో ఎన్నడూ లేనంతగా నేడు అతి ముఖ్యమైన అంశాలుగా మారాయని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆంటోని బ్లింకెటన్ పేర్కొనారు. గాంధీ జయంతి పురస్కరించుకుని అమెరికా వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు, వివిధ సంస్థలు, వివిధ దేశాల ప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్ముడి 152వ జయంతిని చేసుకోవడానికి మేం భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా మిత్రుల బృందంలో చేరుతున్నాం అని బ్లింకెన్ పేర్కొన్నారు. రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న గాంధీ స్మారకం వద్ద అమెరికాలోని భారత రాయబారి తరుణ్ జీత్ సింగ్ సంధు నివాళులు అర్పించారు. భారత్, అమెరికా, ప్రపంచవ్యాప్తంగా అనేక తరాలను మహాత్ముడి జీవితం నేటికీ ప్రభావితం చేస్తోందని, వారిలో స్ఫూర్తిని రగిలిస్తోందని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)