భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణకు అమెరికాలోని న్యూయార్క్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎన్.వి.రమణకు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైశ్వాల్, తానా మాజీ అద్యక్షుడు జయ్ తాళ్లూరి, తానా నాయకులు వలివేటి బ్రహ్మాజీ, వాసిరెడ్డి వంశీ, అరవింద్ ఘన స్వాగతం పలికారు. న్యూజెర్సీలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ నార్త్ అమెరికా ఆధ్వర్యంలో, వర్జీనీయాలో తెలుగు కమ్యూనిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీ ఆధ్వర్యంలో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాల్లో ఎన్.వి.రమణ పాల్గొంటారు. ఎన్.వి.రమణ గౌరవార్థం జులై 1న మిల్పిటాస్‌లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ప్రత్యేక సభను నిర్వహించనుంది. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఎన్.వి.రమణ ప్రసగించనున్నారు.