Namaste NRI

అన్వేషి నుంచి ఏదో ఏదో కలవరం

విజయ్ చరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం అన్వేషి. అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఏదో ఏదో కలవరం అనే పాటను భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా రిలిజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తో న్న సినిమాలోని ఈ పాటను చైతన్య వర్మ రాశారు. అనురాగ్ కులకర్ణి, దీప్తి ప్రశాంతి పాటను మధురంగా ఆలపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు వి.జె.ఖన్నా మాట్లాడుతూ ఈ సినిమాలో హీరోహీరోయిన్లు విజయ్ చరణ్, సిమ్రాన్ గుప్తాలు చక్కగా నటించారు. అనన్య నాగళ్ల ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆమె చుట్టూనే కథ తిరుగుతుంటుంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో నడించే సినిమా ఇది అని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ చైతన్ భరద్వాజ్ నాకెంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అనురాగ్ కులకర్ణి వంటి సింగర్ ఉండటం మన ఇండస్ట్రీకి అదృ ష్టం.ఈ సాంగ్‌లో మంచి సాహిత్యం ఉంది అని చెప్పారు. ఈ చిత్రానికి టెక్నీషియ‌న్స్‌:  బ్యాన‌ర్‌: అరుణ  శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, నిర్మాత‌:  టి.గ‌ణ‌ప‌తి రెడ్డి, కో ప్రొడ్యూస‌ర్స్‌: హరీష్ రాజు, శివ‌న్ కుమార్ కందుల‌, గొల్ల వెంక‌ట రాంబాబు, జాన్ బోయ‌ల‌ప‌ల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  దుర్గేష్.ఎ, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  వి.జె.ఖ‌న్నా, సినిమాటోగ్రఫీ:  కె.కె.రావు, మ్యూజిక్‌:  చైత‌న్ భ‌ర‌ద్వాజ్‌,  ఎడిట‌ర్‌:  కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, లిరిక్స్‌:  చైత‌న్య ప్ర‌సాద్‌, చైత‌న్య వ‌ర్మ‌, శుభం విశ్వ‌నాథ్‌,  స్టంట్స్‌:  జాషువా, కొరియోగ్ర‌ఫీ:  ప్రేమ్ ర‌క్షిత్‌, విద్యాసాగ‌ర్ రాజు, పి.ఆర్‌.ఒ:  వంశీ కాకా. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్, హీరో విజయ్ చరణ్ దాట్ల, టి.గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events