
బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా తన చిరకాల స్నేహితుడు జహీర్ ఇక్బాల్‌తో కలిసి వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. వీరిద్దరి పెళ్లి వేడుక ముంబయిలోని సోనాక్షి సిన్హా స్వగృహంలో నిరాడంబరంగా జరిగింది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. ఈ కొత్త దంపతులకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేశారు.
