జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఈ ఎన్నికల్లో జేఎంఎం కూటమికి రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 56 స్థానాలు, ఎన్డీయే కూటమికి 24 స్థానాలు లభించిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ చీఫ్ శరద్ వవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఉన్నారు.