Namaste NRI

తొలి టెస్టులో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. భారత్ ఘన విజయం

పేసర్లకు స్వర్గధామంలాంటి గబ్బా పిచ్‌ పై ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమ్‌ ఇండియా.. స్వింగ్‌కు రెడ్‌ కార్పెట్‌ పరిచే సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై విజయంతో ముగింపు పలికింది. సుదీర్ఘ టెస్టు చరిత్రలో ఏ ఆసియా జట్టు సాధించలేని ఘనతను ఖాతో వేసుకున్న కోహ్లీ సేన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ముందంజ వేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ 113 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యాన్ని అందుకునే ప్రయత్నంలో 94/4 నుంచి చివరి రోజు ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.  గురువారం ఆటలో 97 పరుగులే జోడిరచిన సఫారీ జటుÊ్ట మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ ( 156 బంతుల్లో 77:12 ఫోర్లు) టాప్‌ స్కోరప్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా, షమీ చెరో 3 వికెట్లు తీయగా అశ్విన్‌, సిరాజ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన కేఎల్‌ రాహుల్‌ ప్లేయర్‌ ఆఫ ద మ్యాచ్‌గా నిలిచాడు.

                        చివరి రోజు ఇద్దరు ప్రధాన బ్యాటర్లు ఎల్గర్‌, బవుమా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. వీరిద్దరూ ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తూ చకచకా పరుగులు సాధించారు. అయితే అది ఎంతో సేపు సాగలేదు. ఎల్గర్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరికించుకోవడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. దూకుడుగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించిన డి కాక్‌ (21)ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో జట్టు ఆశలు సన్నగిల్లాయి. తర్వాతి ఓవర్లోనే ముల్డర్‌ (1) వెనుదిరగడంతో డ్రాకు ప్రయత్నించే అవకాశం కూడా కనిపించలేదు. లంచ్‌ సమయానికి స్కోరు 182/7 వద్ద నిలిచింది. ఒక వైపు తెంబా బపువా (35 నాటౌట్‌) పోరాడినా, రెండో సెషన్‌లో దక్షిణాఫ్రికా ఆట ముగించేందుకు రెండు ఓవర్లు సరిపోయాయి.  అశ్విన్‌ వరుస బంతుల్లో చివరి రెండు వికెట్లు తీసి గెలుపు లాంఛనం పూర్తి చేశాడు. ఇరు జట్ల మధ్య జనవరి 3 నుంచి జొహన్నెస్‌ బర్గ్‌ వేదికగా రెండో టెస్టు ప్రారంభంకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events