ప్రపంచ తెలుగు భాషాప్రేమికులందరికీ సుస్వాగతం
“దక్షిణాఫ్రికా తెలుగు సంఘం”, “వీధి అరుగు- నార్వే” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, తెలుగు భాష సాహిత్య సంస్కృతులకు పట్టం కడుతూ, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలోని 75 + తెలుగు సంస్థల సమన్వయంతో, తెలుగువారందరూ కలిసి జరుపుకునే రెండు రోజుల అంతర్జాతీయ వేడుకలు. “తెలుగు భాషా దినోత్సవం – 2021. తేదీ: 28, 29 ఆగష్టు- 2021 సమయం:12 :00 నుండి 24 :00 వరకు (భారత కాలమానం) భారత ఉపరాష్ట్రపతివర్యులు గౌ. శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, భారత ప్రధాన న్యాయమూర్తి గౌ. శ్రీ యన్ వి రమణ గారు వంటి పెద్దలు ముఖ్య అతిథులుగా ఆశీర్వదిస్తున్న కార్యక్రమం.
“NRI Telugu Idol” సంగీత పురస్కారాలు
“ప్రవాస తెలుగు పురస్కారాలు”
వివిధ దేశాల కళాకారులచే తెలుగు జానపద, సంగీత, నృత్య సాంస్కృతిక కార్యక్రమాలు
గౌరవ అతిథులుగా ప్రముఖ తెలుగు సినీ దిగ్గజాల ప్రత్యేక ప్రసంగాలు
భారతదేశం నుండి ప్రముఖ రచయితలు, కవిపండితుల ఆసక్తికరమైన సాహిత్యోపన్యాసాలు, చర్చలు
తెలుగు సాహిత్య సంస్కృతీ ప్రియులందరినీ ఎంతగానో అలరించే మరిన్ని చక్కటి కార్యక్రమాల పరంపరతో మీ ముందుకు రాబోతున్న ఈ “తెలుగు భాషా దినోత్సవం 2021” కార్యక్రమాన్ని వీక్షించి మీ ఆశీస్సులను అందించి విజయవంతం చేయవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాము. కార్యక్రమాన్ని వీక్షించుటకు YouTube Live: YouTube /VeedhiArugu
Facebook Live: https://www.facebook.com/SATELUGUCOMMUNITY
ధన్యవాదాలతో నిర్వాహకులు