Namaste NRI

స్పార్క్ మూవీ నా మూడేళ్ల క‌ల..‌  విక్రాంత్

విక్రాంత్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం స్పార్క్‌ L.I.F.E.మోహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇది మల్టీజానర్‌ మూవీ. ఇందులో యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌, కామెడీ.. అన్నీ ఉంటాయి. థ్రిల్‌ కలిగించే సినిమా కూడా. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండటం వల్లే దీన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. ఈ సినిమాలో సగటు ప్రేక్షకుడికి కావాల్సిన అంశాలన్నీ ఉంటాయి అని విక్రాంత్‌ చెప్పారు. హీరో విక్రాంత్ మాట్లాడుతూ స్పార్క్ మూవీ నా మూడేళ్ల కల. ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నేను మూడేళ్ల ముందు యు.ఎస్‌లో ట్రైన్‌లో వెళుతుండ‌గా ఓ విష‌యాన్ని చ‌దివాను. ప్ర‌తి మ‌నిషి రెండు సార్లు చ‌నిపోతాడ‌ట‌. ముందుగా క‌ల‌లు క‌న‌టం, వాటిని నేర‌వేర్చుకోలేక‌పోతే చ‌నిపోతాడు. మ‌రోసారి భౌతికంగా చ‌నిపోతాడు అని అందులో రాసి ఉంది. అది చ‌ద‌వ‌గానే ఉద్యోగం, సంపాద‌నలో ప‌డి నేను క‌ల‌లు క‌న‌టాన్ని మ‌ర‌చిపోయాన‌ని అనిపించింది. నేను ఒక సినిమా పిచ్చోడ్ని. కాబ‌ట్టి.. సినిమా చేయాల‌ని భావించాను. అనుకున్న‌ట్లుగానే ఏడాదిన్న‌ర పాటు క‌ష్ట‌ప‌డి స్పార్క్ మూవీ క‌థ‌ను రాసుకున్నాను. మ‌రో ఏడాదిన్న‌ర పాటు క‌ష్ట‌ప‌డి సినిమాను నిర్మించాం అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో విక్రాంత్, హీరోయిన్ మెహ‌రీన్‌, కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు గురు సోమ‌సుంద‌రం, మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ వ‌హాబ్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ చిత్రం నవంబర్‌ 17న విడుదల కానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events