యూఏఈ లోని భారతీయులకు అక్కడి ఇండియన్ కాన్సులేట్ కీలక సూచన చేసింది. వర్షాలు, వరదల్లో పాస్‌పోర్ట్ కోల్పోయిన భారతీయుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్టు ప్రకటించింది. యూఏఈని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత మంది భారతీయులు తమ పాస్‌పోర్టులను కోల్పోగా మరికొందరి పాస్‌పోర్ట్‌లేమో ధ్వంసం అయ్యాయి. ఈ విషయం ఇండియన్ కాన్సాలేట్ దృష్టికి రావడంతో స్పందించింది. వరదల్లో పాస్‌పోర్ట్‌లు కోల్పోయిన భారతీయుల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కొత్త పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పాస్‌పోర్టులు ధ్వంసం అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపింది. ఖీబjaఱతీaష్ట్ర, ఖaశ్రీపa ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు సుమారు 80 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపిది. దుబాయిల్ కూడా ఈ డ్రైవ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడిరచింది. ఈ నెల 28 వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.