గొప్ప ఆలోచనలు, విలువలు, సూత్రాలతో అద్భుతమైన వ్యక్తిగా మహారాజ అగ్రసేన్ ప్రజల హృదయాలలో చాలా ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అహింసకు చిహ్నం, శాంతి దూత మహాజాజు అగ్రసేన్ 5145 జయంతి ఉత్సవాలు తెలంగాణ అగర్వాల్ సమాజ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని క్లాసిక్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మహారాజ అగ్రసేన్ నాయకత్వం, దయ, శాంతిని రూపొందించడంలో విశిష్ట ఉదాహరణగా ప్రపంచంలో నిలిచాడని కొనియాడారు. అగర్వాల్ సమాజ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని, దాదాపు వారందరూ వ్యాపార వర్గాలుగా తమ జీవనం కొసాగిస్తున్నారని, వారు రాష్ట్ర పురోగతి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు అంజనీ కుమార్, నాయకులు అంకిత్ గుప్తా, అశిష్ దోచనీయ, నవీన్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాహుల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)