స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ. శివ దర్శకత్వం. ఈ మూవీ సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ ౩డీ ఫార్మా ట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్ తో పాటు పోస్టర్‌లు విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
డా.బీఆర్ అంబేద్కర్ జయంతి, తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఇక ఈ పోస్టర్లో ఈ సినిమాను 2024లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించా రు. ఈ పోస్టర్‌లో సూర్య టైం లుప్‌లో కనిపిస్తున్నాడు. అయితే విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించ లేదు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. సూర్య కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ అందించిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కంగువ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుండగా, రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.