Skip to main content

Namaste NRI

డాయ్‌రా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

కరీనాకపూర్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ జంటగా నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ డాయ్‌రా. మేఘనా గుల్జార్‌ దర్శకురాలు. ఈ నెల 31న ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భిన్న ధృవాల్లాంటి ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్స్‌ ఓ కేసు పరిశోధనలో ఎదుర్కొన్న సవాళ్లు, నేరాన్ని వారిద్దరు చూసే దృష్టికోణం నేపథ్యంలో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, ఎమోషనల్‌ క్రైమ్‌ డ్రామాగా ఆకట్టుకుంటుందని మేకర్స్‌ తెలిపారు. జంగ్లీ పిక్చర్స్‌, డాక్టర్‌ జయంతిలాల్‌ గాడా పెన్‌ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events