తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అవినీతి కేసు నుంచి బయటపడి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సింగపూర్ తెలుగుదేశం ఫోరం సభ్యులు సీన్గాకాంగ్ వెల్మురుగన్ దేవాలయం నుంచి లిటిల్ ఇండియాలోని పెరుమాళ్ శ్రీనివాసన్ దేవాలయం వరకు 13 కిలో మీటర్లు పాదయాత్రగా వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారు. చంద్రబాబు కుటుంబం కోసం అర్చన పూజ కార్యక్రమాలు చేపించి, 300 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఫోరం సభ్యులంతా పాల్గొని చంద్రబాబుకి అంతా మంచే జరగాలని దేవదేవుడు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామికి కోరుకున్నారు.