సినిమా చివర్లో ఈ పాటతో మిమ్మల్ని ( ప్రేక్షకులు) ఆశ్చర్య పరచాలనుకున్నాం. అయితే ఎగ్జయిట్‌మెంట్‌ని ఆపుకోలేక పోయాం అని రాజమౌళి ట్వీట్ చేశారు. టాలీవుడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఆర్‌ఆర్‌ఆర్. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మేకర్స్ అభిమానుల్లో జోష్ నింపే క్రేజీ అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్ నుంచి ఎత్తర జెండా పాటను మార్చి 14న లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించింది టీం. యంయం కీరవాణి సంగీత సారథ్యంలో కంపోజ్ చేసిన ఎత్తెర జెండా పాట చాలా కలర్‌ఫుల్‌లో ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని తాజా లుక్‌తో తెలిసిపోతుంది. తారక్, రాంచరణ్ పంచె కట్టులో కనిపిస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. అలియాభట్ లంగావోణిలో కొత్తగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో కొమ్రంభీం పాత్రలో జూ.ఎన్టీఆర్ నటిస్తుండగా, రాంచరణ్ అల్లూరి సీతారామ రాజు రోల్‌లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ఒలీలియా మోరిస్, చరణ్ సరసన ఆలియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)