ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ తమ ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం పరిచయం చేసింది. ఎయిర్‌పోర్ట్‌లో దిగాక క్యాబ్ బుక్ చేసి వేచి చూసే బదులు, ప్రయాణంలో ఉంటూనే గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలుగా క్యాబ్ బుక్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. తన ఆన్‌బోర్డ్ సర్వీస్ స్పైస్‌స్క్రీన్ ద్వారా ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. ఆగస్టు 12 ఢల్లీిలో ఈ సేవలు ప్రారంభించామని తెలిపింది. దశలవారీగా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, గోవా, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్, పుణె వంటి ప్రధాన విమానాశ్రయాలకు విస్తరించనున్నామని కంపెనీ తెలిపింది. ప్రయాణ సమయాన్ని వేచి చూసే సమయాన్ని తగ్గించడానికి ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు తెలిపింది.
గతేడాది స్పైస్‌జెట్ ఆగస్టులో స్పైస్‌స్క్రీన్ ఆన్‌బోర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ వైర్‌లెస్ నెట్‌వర్క్‌కు స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్‌తో కనెక్ట్ అవ్వొచ్చు. దీని ద్వారా క్యాబ్‌ను బుక్ చేసుకోవచ్చు. క్యాబ్ బుక్ చేసుకున్నాక మెసేజ్ లేదా వాట్సాప్ ద్వారా ఓటీపి వస్తుంది. క్యాబ్ బర్నీ పూర్తయ్యాక చెల్లింపులు పూర్తి చేయొచ్చు. క్యాబ్ బుకింగ్‌కు సంబంధించి తమ ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్లు కూడా అందిస్తున్నట్లు స్పైస్‌జెట్ తెలిపింది. ఒకవేళ ఏదైనా కారణంతో క్యాబ్ క్యాన్సిల్ అయినా ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీలూ పడబోనని స్పైస్‌జెట్ పేర్కొంది.