Namaste NRI

గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం

అమెరికాలో 23వ తానా మహాసభల వేదికగా గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీరామ్ ఆలోకం, రామకృష్ణ వాసిరెడ్డి, సుధీర్ ఉమ్మినేని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, డాక్టర్ రవి వేమూరి, గోరంట్ల పున్నయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ, పాతూరి నాగభూషణం, మన్నవ మోహన కృష్ణ, అన్నాబత్తిన జయలక్ష్మి, డాక్టర్ నిమ్మల శేషయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ  రాజధాని అమరావతి గుంటూరు జిల్లాలో ఉండటం అందరికీ గర్వకారణం. జిల్లా అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలన్నారు. విద్యావంతులు, గొప్పగొప్ప కళాకారులకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా. ఇక్కడ పుట్టడం మనందరికీ గర్వకారణం. కొండవీడు, ఉండవల్లి గుహలు చారిత్రక ప్రాంతాలుగా ప్రసిద్ధికెక్కాయి అని అన్నారు. అన్నాబత్తిన జయలక్ష్మి మాట్లాడుతూ గుంటూరు జిల్లా ప్రవాసాంధ్రులు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. డాక్టర్ నిమ్మల శేషయ్య మాట్లాడుతూ పాలకపక్ష అరాచకాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ రవి వేమూరి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ టీడీపీకి చెందిన ఎంపవర్‌మెంట్ సెల్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు.మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ గుంటూరు జిల్లా నుంచి పెద్దఎత్తున యువత విదేశాలకు తరలివస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా అమెరికాలో మంచి అవకాశాలను పొందుతూ జీవితంలో రాణిస్తున్నారన్నారు.

గోరంట్ల పున్నయ్య చౌదరి మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా గుంటూరులో పేద, ప్రతిభ, గ్రామీణ నేపథ్యం కలిగిన బాలికల వసతిగృహం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతపరచడానికి నూతన భవన నిర్మాణాలకు ప్రవాసంధ్రులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.పాతూరి నాగభూషణం మాట్లాడుతూ అమరావతి రాజధానిని మార్చడం ఎవరివల్ల సాధ్యం కాదని తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రవాసాంధ్రులు కీలకపాత్ర పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ, మురళీ వెన్నం, భాను మాగులూరి, సామినేని కోటేశ్వరరావు, ఘంటా పున్నారావు, రామ్ చౌదరి ఉప్పుటూరి, ఎంవీ రావు, రాజశేఖర్ చెరుకూరి, బుల్లయ్య చౌదరి ఉన్నవ, వెంకట సుబ్బారావు ఆళ్ళ తదితరులు ప్రసంగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress