నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం స్పై. గ్యారీ బీహెచ్ దర్శకుడు. కె.రాజశేఖర్ రెడ్డి నిర్మాత. ఐశ్వర్య మీనన్, సన్యా ఠాకూర్ కథానాయికలు. ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే స్పై థ్రిల్లర్ ఇది. నేతాజీ మరణ రహస్యం నేపథ్యంలో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా కథాంశం పాన్ ఇండియా స్థాయికి రీచ్ అవుతుందని ముందే ఊహించాం. వివిధ భాషల్లో పెద్ద సంస్థలు ఈ సినిమా హక్కుల్ని పొందాయి.
బెంగాల్, మరాఠీ భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. మంచి కథకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల కుదిరారు. సెన్సార్ పూర్తయింది. యు.ఎ.సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమాలో ఎలాంటి వివాదాలు ఉండవు. చరిత్రలోని తెలియని కోణాన్ని చెబుతున్నాం అన్నారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ చరణ్‌తేజ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రం నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.