రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రాజేష్ దండా నిర్మాత. అనిల్ సుంకర సమర్పకులు. హైదరాబాద్‌లో ప్రారంభమైంది చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి కథానాయకుడు నారా రోహిత్ క్లాప్‌నిచ్చారు. హాస్యభరితంగా సాగే కుటుంబ కథా చిత్రమిదని, త్వరలోనే చిత్రీకరణని ప్రారంభిస్తామని సినీవర్గాలు తెలిపాయి. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, దేవిప్రసాద్, ప్రియ తదితరులు నటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర, వి.ఐ.ఆనంద్, విజయ్ కనకమేడల, ఏఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రానికి సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం: రామిరెడ్డి, కూర్పు: ఛోటా కె.ప్రసాద్, కళ: బ్రహ్మ కడలి, కథ: భాను ఘోవరపు, సంభాషణలు: నందు సవిరిగాన, నిర్మాత : బాలాజీ గుత్తా,














