శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మార్క్సిస్ట్ నేత అనుర కుమార దిసనాయకే (56) విజయం సాధించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శనివారం జరిగిన ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఎవరికీ 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దీంతో రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించి ఈ ఫలితాన్ని ప్రకటించారు. దిస్సనాయకే మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున పార్టీ నేత. మరికొన్ని పార్టీలతో కలిసి నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) పేరుతో ఎన్నికల్లో పోటీ చేశారు. సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) నేత సాజిత్ ప్రేమదాసపై దిసనాయకే గెలిచారు. శ్రీలంక అధ్యక్షునిగా దిసనాయకే నేడు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్‌పీపీ ప్రకటించింది. ప్రెసిడెంట్ అనుర దిసనాయకే, ప్రియమైన బిడ్డ శ్రీలంకను మీ సంరక్షణకు అప్పగిస్తున్నాను అని దిసనాయకేను ఉద్దేశించి విక్రమసింఘే ఒక ప్రకటనలోతెలిపారు.