శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దేశ ఖజానా దివాలా తీసిందని వెల్లడిరచింది. 51 బిలియన్ డాలర్ల అప్పును తీర్చలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ రుణాలు చెల్లించలేమని చేతులెత్తేసింది. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ప్రధాని మహింద్ర రాజపక్స అన్నారు. కొవిడ్ 19 లాక్‌డౌన్ కారణంగా విదేశీ మారక నిల్వలు మరింత దిగజారాయని తెలిపారు. ప్రజలు నిరసనలు విరమించి రోడ్లపై నుంచి వెనక్కి మరలాలని కోరారు. వీధుల్లో నిరసనలతో నగద కొరతను ఎదుర్కొంటున్న మన దేశానికి ఆర్థిక సాయం అందడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.