శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తున్నది. మహింద రాజపక్స రాజీనామా నేపథ్యంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం పరిష్కారమయ్యే వరకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు రాజీనామాకు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)