యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్కాట్లాండ్ దేశంలో మొట్టమొదటిసారి శ్రీరామనవమి వేడుకలను కన్నులపండువగా నిర్వహించారు. అబర్టీన్ హిందూ దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని పడకంటి వివేక్, గోల్కొండ వేద, రమేశ్‌బాబు, డాక్టర్ నాగ ప్రమోద్, బోయపాటి హరి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ సీతారాముల కల్యాణం కమనీయంగా సాగింది. ఈ వేడుకలకు స్కాట్లాండ్‌లోని తెలుగు ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 350 మంది ఎన్నారూ భక్తులు తరలివచ్చి, కల్యాణాన్ని వీక్షించారు. స్వామివారికి కట్నకానుకలు సమర్పించారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్నదాన ప్రసాద వితరణ చేశారు.
