Skip to main content

Namaste NRI

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ నుంచి ప్రేమించానే పిల్లా సాంగ్ రిలీజ్

వెన్నెల కిశోర్‌, అనన్య నాగళ్ల ప్రధానపాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌. రైటర్‌ మోహన్‌ దర్శకుడు. వెన్నపూస రమణరెడ్డి నిర్మాత. ప్రమోషన్‌లో భాగంగా ఈ చిత్రంలోని పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ప్రేమించానే పిల్లా.. నిన్ను ప్రేమించానే పిల్ల.. లవ్‌ అంటారా పిల్లా.. కాదు లైఫ్‌ అంటారే పిల్లా అంటూ సాగే ఈ పాటను పూర్ణాచారి రాయగా, సునీల్‌ కశ్యప్‌ స్వరపరిచారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. సియా గౌతమ్‌, స్నేహా గుప్తా, రవితేజ మహాద్యం తదితరులు ఇతర పాత్రలు పోషిస్తు న్నారు.  ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణంలో ఉన్నది.  ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్‌ ఎన్‌., సమర్పణ: లాస్య రెడ్డి, నిర్మాణం: శ్రీ గణపతి సినిమాస్‌.

Social Share Spread Message

Latest News