Skip to main content

Namaste NRI

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ టైటిల్ సాంగ్ విడుదల

వెన్నెల కిషోర్‌, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్‌ మోహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌ శ్రీకాకుళం షెర్లాక్‌ హోమ్స్‌. వెన్నపూస రమణా రెడ్డి నిర్మాత. సీయా గౌతమ్‌, స్నేహ గుప్తా, రవితేజ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి మా ఊరు శ్రీకాకుళం అంటూ సాగే తొలి గీతాన్ని రిలీజ్‌ చేశారు. సునీల్‌ కశ్యప్‌ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. మంగ్లీ ఆలపించింది. శ్రీకాకుళం ప్రాంతం గొప్పదనాన్ని తెలియజేస్తూ చక్కటి విజువల్స్‌తో ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. వెన్నెల కిషోర్‌ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్‌ మూవీ అవుతుందని, వినోదం మేళవించిన గూఢచారి కథాంశమని చిత్ర బృందం పేర్కొంది.  త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.  ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్‌ ఎన్‌, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, రచన-దర్శకత్వం: రైటర్‌ మోహన్‌.

Social Share Spread Message

Latest News