Skip to main content

Namaste NRI

సంబరాల ఏటిగట్టు నుంచి బ్రిటిషర్ గా శ్రీకాంత్.. బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

సాయి దుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం సంబరాల ఏటిగట్టు. రోహిత్‌ కెపి దర్శకత్వం. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్‌ హీరో శ్రీకాంత్‌ పవర్‌ ఫుల్‌ పాత్రని పోషిస్తున్నారు. శ్రీకాంత్‌ బర్త్‌ డే సందర్భంగా ఆయన్ని బ్రిటీష్‌ అధికారి పాత్రలో ప్రజెంట్‌ చేస్తూ కొత్త పోస్టర్‌ రిలీజ్‌ రిలీజ్‌ చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఆయన లుక్‌ అదిరిపోయింది. ఈ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌ పాన్‌-ఇండియా విడుదలకు సిద్ధమవుతోంది. సాయి దుర్గా తేజ్‌, ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్‌, శ్రీకాంత్‌, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రానికి రచన, దర్శకత్వం: రోహిత్‌ కె.పి, నిర్మాతలు: కె నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి, డీఓపీ : వెట్రి పళనిసామి, సంగీతం: బి అజనీష్‌ లోక్‌నాథ్‌, ఎడిటర్‌: నవీన్‌ విజయ కృష్ణ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: గాంధీ నడికుడికర్‌, ఫైట్స్‌: కెవిన్‌ మాస్టర్‌.

Social Share Spread Message

Latest News