సింగపూర్లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’, ‘తెలంగాణ కల్చరల్ సొసైటీ’, ‘తెలుగు భాగవత ప్రచార సమితి’ ‘కాకతీయ సాంస్కృతిక పరివారం’ సంయుక్త ఆధ్వర్యంలో పంచ మహా సహస్రావధాని, అవధాన సామ్రాట్ డా. మేడసాని మోహన్ గారిచే వారంరోజుల పాటు భాగవత ప్రవచనసుధ తేదీలు: 02/04/2022 – 08/04/2022 సమయం: శని ఆదివారాల్లో 1:00pm SGT, 10:30pm IST సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 7:00pm SGT, 4:30pm IST. వేదిక: జూమ్ అంతర్జాలం. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ & ఫేస్ బుక్ ప్రత్యక్ష ప్రసారం. మా ఈ ప్రయత్నానికి మీ సహాయసహకారాలను అందించి, భాగవత విశిష్టతను గూర్చి తెలుసుకొని, భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తూ, ప్రపంచ నలుమూలలలో ఉన్న తెలుగు వారందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము.