Namaste NRI

తానాలో ‘శ్రీనివాస కళ్యాణం’

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ మహాసభల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు. ఈ మహాసభల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. జూలై 9వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తానా మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నారు. తిరుమల నుంచి వచ్చే పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో జరిగే ఈ శ్రీనివాస కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నారు.

https://tanaconference.org/tana-ttd-srinivasa-kalyanam-details.html

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events