సీనియర్ దర్శకుడు కె.విజయభాస్కర్ తెరకెక్కిస్తున్న చిత్రం జిలేబి. ఎస్‌ఆర్కే ప్రొడక్షన్స్ సంస్థ రూపొందిస్తుంది. శ్రీకమల్ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. శివాని రాజశేఖర్ కథానాయిక. విజయ దశమి సందర్భంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్‌నిచ్చారు. కథానాయకుడు రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత స్రవంతి రవికిశోర్ చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందజేశారు. నేను చాలా ఏళ్ల తర్వాత చేస్తున్న చిత్రమిది. సినిమా రంగంలో అనుభవం ఉన్న నిర్మాతలతో కలిసి ప్రయాణం చేస్తుండడం ఆనందంగా ఉంది అన్నారు కె.విజయభాస్కర్. రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, గెటప్ శ్రీను, మిర్చికిరణ్, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్నారు. గుంటూరు రామకృష్ణ, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల, కళ: సంపత్‌రావు, కూర్పు : ఎం.ఆర్.వర్మ, రచన`దర్శకత్వం: విజయ్‌భాస్క్‌ర్ కె.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)