నిఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రం సంగీత్. సాద్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో షురూ అయింది. లహరి ఫిలిమ్స్, ఆర్‌బీ స్టూడియోస్, ఫస్ట్ యాక్షన్ స్టూడియోస్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
నిహారిక కొణిదెల స్క్రిఫ్ట్‌ను అందజేయగా, శౌర్యువ్ కెమెరా స్విఛాన్ చేశాడు. ఎస్‌ఎస్ కార్తికేయ ఫస్ట్ క్లాప్ కొట్టాడు. ఈ చిత్రంలో తేజు అశ్విని హీరోయిన్‌గా నటిస్తోంది. విక్రమ్ శివ, సూర్య గణపతి, హర్షి చెముడు, నిషాంత్ షాయి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవీన్ మనోహరన్, చంద్రు మనోహరన్, స్రవంతి నవీన్ ఈ చిత్రానికి నిర్మిస్తుండగా, మాజ్ ఖాన్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. కల్యాణ్ నాయక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలోనే మూవీ షూటింగ్ షురూ కానుంది.