Namaste NRI

ఉత్తర కొరియాలో కలకలం

ఉత్తర కొరియాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కఠిన లాక్‌డౌన్‌ లు పెట్టినా, క్వారంటైన్‌ రూల్స్‌ను అమలు చేసినా, ఆ దేశంలోకి ఎంటరైన మూడు రోజుల్లోనే కేసులు లక్షలు దాటేశాయి.  ఇప్పటిదాకా 8,20,620 కేసులు నమోదు కాగా, బాధితుల్లో 3,24,550 మంది చికిత్స తీసుకుంటున్నారు. మరో 15 మంది జ్వరం వల్ల చనిపోయారంటూ ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 42కు పెరిగింది. కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండడంతో దేశమంతా లాక్‌డౌన్‌ విధించారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలు నగరాలు, కౌంటీల్లో లాక్‌ డైన్‌ కొనసాగుతోంది.  పని ప్రాంతాలు, ఉత్పత్తి యూనిట్లు, నివాస సముదాయాలన్నింటినీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా మూసేసినట్టు పేర్కొంది. ఉత్తర కొరియన్లు  ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం గమనార్హం. …………

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events