Skip to main content

Namaste NRI

ఏఐ అభివృద్ధిని ఆపండి.. అమెరికాలో భారీ నిరసన ప్రదర్శన

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో అత్యాధునిక ఏఐ నమూనాల అభివృద్ధిని ఆపాలని డిమాండ్‌ చేస్తూ
భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆంత్రోపిక్‌, ఓపెన్‌ఏఐ, ఎక్స్‌ఏఐ కార్యాలయాల వెలుపల నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ మూడు కంపెనీల సీఈవోలు ఫ్రాంటియర్‌ ఏఐ మోడల్స్‌ డెవలప్‌మెంట్‌ ఆపుతామనే హామీ ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. సినీ దర్శకుడు, ఏఐ సేఫ్టీ పరిశోధకుడు మైకేల్‌ ట్రజ్జి ఈ నిరసనలకు నేతృత్వం వహించారు. అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధ(ఏఐ) విధానాన్ని జాతీయం చేయాలనుకుంటున్నది. దానికి దిగ్గజ కంపెనీలు సాయం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్టాప్‌ ఏఐ రేస్‌ గ్రూప్‌ ఆందోళనలు చేపట్టింది.

Social Share Spread Message

Latest News