అమెరికా కరెన్సీలో అతితక్కువ విలువున్న పెన్నీ ( సెంట్స్) లను కొత్తగా తయారు చేయడాన్ని నిలిపేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. ఒక నాణెం మింటిగ్కు రెండు పెన్నీల ఖర్చు వస్తోంది ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఓ వృథా వ్యవహారంగా అభివర్ణించారు. చాలాకాలంగా అమెరికా పెన్నీలను తయారుచేస్తోది. ఒక్కోదాని ముద్రణకు రెండు సెంట్స్ ఖర్చు వస్తోంది. ఇది చాలా వృథా. అందుకే పెన్నీల తయారీ నిలిపేయాలని ట్రెజరీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశా. మన గొప్ప దేశ బడ్జెట్ నుంచి వృథాను తొలగించండి. అది పెన్నీ అయినా సరే అని అన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldtrump-5-300x160.jpg)