Namaste NRI

బ్రిటన్ లో వింత ఆచారం

బ్రిటన్‌లో ఒక వింత ఆచారం వెలుగులోకి వచ్చింది. మరణించిన వ్యక్తి దంతాలు పీకి దగ్గర బంధువులకు పంపిణీ చేసే ఇచ్చే విధానం వెలుగులోకి వచ్చింది. వేల్స్‌కు చెందిన ఒక ఉన్నత కుటుంబంలో ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతున్నది.  ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఒకరు మరణించారు. దీంతో చనిపోయిన వ్యక్తి పళ్లు తొలగించి బంధువులకు ఇచ్చే భర్త కుటుంబ ఆచార కార్యక్రమానికి వెళ్లేందుకు ఒక మహిళ నిరాకరించింది. ఇది సంస్కృతి విషయం అని నేను అనుకోవడం లేదు. దానికి సరైన ఆధారాన్ని కనుగొలేకపోయాను. లేదా సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుండి రిమోట్‌గా ఇలాంటిదేమీ కనుగొనలేకపోయాను అని రెడ్టిట్‌లో ఆమె పేర్కొంది. ఈ ఆచారం ప్రకారం మరణించిన బంధువు దంతాలు పెకలించి ప్రతి బంధువుకు ఒకటి ఇస్తారని ఆ మహిళ తెలిపింది.

                 ప్రతి కుటుంబం వద్ద ఉండే ఒక ఫాబ్రిక్‌ పర్సులో దాచుకునేందుకు చనిపోయిన వ్యక్తికి చెందిన ఒక పంటిని ఇస్తారని, వారు దానిని అందులో ఉంచుకోవాలని ఆమె చెప్పింది. చనిపోయిన బంధువుతో ఉన్న అనుబంధం మేరకు ఏ కుటుంబానికి ఏ పన్ను ఇవ్వాలన్న నియమాన్ని కూడా వారు పాటిస్తారని తెలిపింది. ఇలా జీవితకాలంలో మరణించిన వారి బంధువుల నుంచి సేకరించిన వేలాది మానవ దంతాలతో ఈ పర్సు నిండిపోతుందని ఆమె తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events