కరోనాను ఎలా వదిలించుకోవాలో ప్రపంచ దేశాలకు అర్థం కావట్లేదు. మాస్కులు ధరించలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా కెనడాలో వచ్చిన వింత వ్యాధి. ఈ వింతవ్యాధి యువతకే ప్రధానంగా సోకుతున్నదని అంటున్నారు. ఈ కొత్త వ్యాది సోకిన వారి గ్రహణేంద్రియాలు పనిచేయడం మానేస్తాయని వైటాలిటీ మెడికల్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ ఉద్యోగి బయటపెట్టారు. గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని కౌమారుల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. వేగంగా బరువును కోల్పోవడం, నిద్ర పట్టకపోవడం, ఆలోచనా శక్తి, కదలికలు తగ్గిపోవడం వంటివి వ్యాధి లక్షణాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడాది ఈ వ్యాధి గురించి వెల్లడైంది. ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న కెనడాలోని బ్రన్స్‌విక్ రాష్ట్రంలో రోగుల సంఖ్య 48 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. ఆ సంఖ్య నిజానికి 150 దాటిందని కొందరు అంటున్నారు. ఇతర ప్రాంతాల్లో అజ్ఞాతంగా వ్యాధి ప్రబలుతూ ఉండొచ్చని కూడా వినిపిస్తున్నది. పర్యావరణ కారణాల వల్ల ఈ వింత్యవాధి ప్రబలుతున్నట్టు చర్చ జరుగుతున్నది. ఇప్పటికే ఆరుగురు చనిపోయారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)