బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ దేశంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. ఆమె నివసించిన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా రెండు ఇంద్రధనస్సులు కనపించాయి. అలాగే ఒక నగరంలో ఆకాశంలో ఎలిజబెత్ రూపంలో, బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఆకట్టుకుంది. 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్, స్కాట్లాండ్లోని వేసవి విడిది నివాసంలో కన్నుమూశారు. అధికారికంగా ఈ విషయం ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్ ప్రాంతంపై ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్‌ను పోలిన మేఘం కనిపించింది. లిన్నే అనే మహిళ కారులో వెళ్తుండగా ఆమె 11 ఏళ్ల కుమార్తె దీనిని గుర్తించింది. అమ్మా క్వీన్ అని అరిచిన ఆ బాలిక ఎలిజబెత్ రూపంలో ఉన్న ఆ మేఘాన్ని తల్లికి చూపించింది. ఓ మై గాడ్ అంటూ ఆ చిన్నారి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో కారును నిలిపిన ఆ మహిళ తన మొబైల్ ఫోన్లో ఫొటోలు తీసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, క్వీన్ ఎలిజబెత్‌ను పోలిన బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఫొటో వైరల్ అయ్యింది.