
భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకెళ్లారు, మరో చరిత్ర సృష్టించారు. శుభాన్షు కక్ష్యకు చేరుకున్న రెండవ భారతీయుడు , అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి ప్రయాణించిన మొదటి భారతీయుడు అయ్యారు. ఈ ప్రయోగం జూన్ 25, 2025న ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా జరిగింది. ఆక్సియం-4 మిషన్ ఒక ప్రైవేట్ అంతరిక్ష విమాన వెంచర్. శుక్లాతో పాటు మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములు అంతరిక్షంలో చేరారు. శుభాన్షు అంతరిక్షయాత్ర భారతదేశ అంతరిక్ష కార్యక్రమంలో ఓ ముఖ్యమైన ఘట్టం. 41 సంవత్సరాల తర్వాత ఓ భారతీయుడు అంతరిక్షంలోకి ప్రయాణించడం ఇదే మొదటిసారి. 1984లో భారత వైమానిక దళ అధికారి, స్వాడ్రాన్ లీడర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి దూసుకెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. కజకిస్తాన్ నుంచి సోవియెట్ అంతరిక్ష నౌకలో సోయెజ్ -టి-11 అంతరిక్ష నౌకద్వారా అంతరిక్షంలోకి దూసుకెళ్లిన భారతీయుడు అయ్యాడు.
