Namaste NRI

ఆకాశ వీధుల్లో సక్సెస్‌ మీట్‌

గౌతమ్‌ కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ఆకాశ వీధుల్లో. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ నాయికగా నటించింది. జీకే ఫిలిం ఫ్యాక్టరీ, మనోజ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకాలపై మనోజ్‌ డీకే, డాక్టర్‌ మణికంఠ నిర్మించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో చిత్ర  సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో, దర్శకుడు గౌతమ్‌ కృష్ణ మాట్లాడుతూ మా చిత్రానికి స్పందన బాగుంది. లవ్‌, ఫ్యామిలీ, డ్రామా ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమాను తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో విడుదల చేయబోతున్నాం అన్నారు. నాయిక పూజిత మాట్లాడుతూ సినిమాకి మంచి  ఆదరణ లభిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమకు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని మరింతగా ఆదరించండి అని కోరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events