విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వారసుడు. రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్, పరమ్. వి.పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ నటిస్తున్న 66వ చిత్రమిది. రెండు పాటలు, రెండు పోరాట ఘట్టాలు మినహా చిత్రీకరణ పూర్తయిందని, ఆదివారం నుంచి చివరి షెడ్యూల్ చిత్రీకరణ మొదలైందని సినీ వర్గాలు తెలిపాయి. విజయ్‌ని మునుపెన్నడూ చూడని పాత్రలో ఆవిష్కరించే చిత్రమిది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం, భారీ హంగులతో కూడిన నిర్మాణంతో సినిమా రూపొందుతోందని నిర్మాతలు తెలిపారు. ప్రభు, శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి విడుదల చసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్. సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)