విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వారసుడు. రష్మిక కథానాయిక. వంశీ పైడిపల్లి దర్శకుడు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా పతాకాలపై దిల్‌రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సుత్తి పట్టుకొని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు హీరో విజయ్. ఆయన లుక్ స్లైలిష్‌గా ఉంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: : కార్తీక్ పళని, సంగీతం: తమన్, కథ, స్క్రీన్‌ప్లే: వంశీ పైడిపల్లి, హరి అహిషోర్ సల్మాన్.