విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ సినిమా వారిసు (తెలుగులో వారసుడు). ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు. శిరీష్, పరమ్ వి. పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త వర్కింగ్ స్టిల్స్‌ను రిలీజ్ చేశారు. శరత్ కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, శ్యామ్, యోగిబాబు, సంగీత, ఖుష్భూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. హర్షిత్ రెడ్డి, హన్షిత సహ` నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.
