Namaste NRI

తెలుగు తెరపై ఇలాంటి కథ రాలేదు

చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించిన చిత్రం పర్‌ఫ్యూమ్‌. జేడీ స్వామి దర్శకుడు. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్కార్‌ అవార్డుగ్రహీత చంద్రబోస్‌ను చిత్ర బృందం ఘనంగా సన్మానించింది. దర్శకుడు మాట్లాడుతూ సరికొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌ ఇది. ఇప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి కథ రాలేదు అన్నారు. హీరో చేనాగ్‌  మాట్లాడుతూ స్మెల్లింగ్‌ అబ్‌సెషన్‌ అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన తొలి చిత్రమిదని, కథలోని మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయని, తన పాత్ర నెగెటివ్‌ ఛాయలతో సాగుతుందని అన్నారు. చంద్రబోస్‌ మాట్లాడుతూ నేను ఇప్పటివరకూ 3700 పాటలు రాశాను. తొలిసారిగా నా గురించి ఓ పాట రాయడం, పాడడం, ఈ వేడుకలోనే జరిగింది. జేడీ ఈ సినిమాను అద్భుతంగా తెరకు ఎక్కించారు. చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అన్నారు.  ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.  ఈ చిత్రానికి జె.సుధాకర్‌, శివ బి, రాజీవ్‌ కుమార్‌, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని నిర్మించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events