Skip to main content

Namaste NRI

ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి : నరేష్‌

సుహాస్‌, శివానీ నాగారం జంటగా నటిస్తున్న చిత్రం హే బల్‌వంత్‌. నిర్మాత వంశీ నందిపాటి, బన్నీవాసుతో కలిసి రిలీజ్‌ చేశారు. గోపి అచ్చర దర్శకత్వంలో నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ హే బల్‌వంత్‌ చిత్రానికి అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, తెలుగు రాష్ర్టాల్లో ప్రీమియర్స్‌ అన్నీ ఫుల్‌ అయ్యాయని, ఒత్తిడిలో ఉన్నవారికి ఓ మెడిసిన్‌లా మనసును తేలికపరిచే చిత్రమిదని చెప్పారు. ఫ్యామిలీస్‌తో కలిసి అనందించే చిత్రమిదని, బ్లాక్‌బస్టర్‌ హిట్‌ గ్యారంటీ అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

సినిమాకు అంతటా పాజిటివ్‌ టాక్‌ రావడం ఆనందంగా ఉందని నిర్మాత నరేంద్ర రెడ్డి అన్నారు. నవ్వులతో థియేటర్లన్నీ ఊగిపోతున్నాయని, తన కెరీర్‌లో ఈ స్థాయి స్పందన ఎప్పుడూ చూడలేదని, ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయని సీనియర్‌ హీరో నరేష్‌ తెలిపారు. తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయని హీరో సుహాస్‌ చెప్పారు. ఈ సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఎంజాయ్‌ చేయాలని కథానాయిక శివానీ నాగారం కోరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events