సుదీప్, అమలాపాల్ జంటగా ఎస్.కృష్ణ తెరకెక్కించిన చిత్రం హెబ్బులి. సి.సుబ్రహ్మణ్యం నిర్మాత. సంపత్ రాజ్, రవి కిషన్, శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో నిండిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. కన్నడలో విడుదలై రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. అందుకే దీన్నిప్పుడు తెలుగులో విడుదల చేస్తున్నాం. నిర్మాణాంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. కచ్చితంగా మా చిత్రం తెలుగు వారికి నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ జన్య, ఛాయాగ్రహణం: ఎ.కరుణాకర్.
