సుహాస్ హీరోగా నటిస్తున్న చిత్రం కేబుల్ రెడ్డి.ఈ చిత్రానికి శ్రీధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, ఫ్యాన్ మేడ్ ఫిలింస్ బ్యానర్‌పై బాలు వల్లు, ఫణి ఆచార్య, మణికంఠ జెఎస్ నిర్మిస్తున్నారు.సుహాస్‌కు జోడిగా షాలిని కొండేపూడి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ కేబుల్ రెడ్డి నవ్వులతో మీ గుండెకి కనెక్షన్ ఇచ్చేస్తాడు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఫస్ట్‌లుక్ గమనిస్తే, సుహాస్ ఈ సినిమాలో కేబుల్ ఆపరేటర్‌గా పని చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను 2024 సమ్మర్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి మహి రెడ్డి పండుగుల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, టెక్నికల్ టీం ను మేకర్స్ త్వరలో తెలియజేస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
