ఉదయ్ శంకర్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం నచ్చింది గర్ల్ ఫ్రెండూ. జెన్నీఫర్ ఇమ్మానుయేల్ కథానాయిక. మధునందన్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం నుంచి ఎర్రతోలు పిల్లా అనే లిరికల్ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. గిఫ్గన్ ఎలియాస్ స్వరకల్పనలోని ఈ గీతానికి గిరి కోడూరి సాహిత్యం అందించారు. ధనుంజయ్ ఆలపించారు. వాణిజ్య ప్రధానంగా సాగే థ్రిల్లర్ చిత్రమిది. త్వరలోనే ప్రేక్షకులు మందుకు తీసుకొస్తాం. పాట క్యాచీగా బాగుందని సుకుమార్ అభినందించారని సినీ వర్గాలు తెలిపాయి. సుమన్, పృథ్వీరాజ్, శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రి భార్గవి, కల్యాణ్ తదితరులు నటిస్తున్నారు. గురుపవన్ దర్శకుడు. అట్లూరి నారాయణరావు నిర్మాత. అట్లూరి ఆర్.సౌజన్య సమర్పకులు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సిద్ధం మనోహర్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)