Namaste NRI

గోదారి గట్టుపైన సుమంత్‌ ప్రభాస్‌

యువనటుడు సుమంత్‌ ప్రభాస్‌, నిధి ప్రదీప్‌ జంటగా నటిస్తున్న చిత్రం గోదారి గట్టుపైన. సుభాస్‌ చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. జగపతిబాబు కీలక భూమిక పోషిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది. ఈ సినిమా టైటిల్‌తోపాటు ఓ పోస్టర్‌ని కూడా మేకర్స్‌ విడుదల చేశారు. ప్రశాంతమైన గోదావరి ప్రాంతాన్ని పోస్టర్‌ ప్రజెంట్‌ చేసింది.

ఓ చల్లని సాయంత్ర వేళ, ప్రశాంతమైన గోదారి వడ్డున స్నేహితులతో కూర్చుని సమయం గడపడం ఎంత ప్రశాంతంగా ఉంటుందో? ఈ సినిమా కూడా అంత ప్రశాంతంగా ఉంటుందని, అందమైన భావోద్వేగాలతో ఈ కథ నిండి ఉంటుందని, గోదావరి జిల్లాలోని వేల్పూరు, రేలంగి, భీమవరం నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, అందుకే గోదారి గట్టుపైన అనే టైటిల్‌ పెట్టామని, ఈ టైటిల్‌ సినిమాకు యాప్ట్‌ అని మేకర్స్‌ తెలిపారు. రాజీవ్‌కనకాల, లైలా, దేవిప్రసాద్‌, సుదర్శన్‌, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్‌, సంగీతం: నాగవంశీకృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events