సుమయరెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం డియర్ ఉమ. ఈ సినిమాకు ఆమె నిర్మాణ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు రచయితగా కూడా పనిచేశారు. పృథ్వీ అంబర్ కథానాయకుడు. సాయిరాజేష్ మహాదేవ్ దర్శకుడు. దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా, హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనలే ఎక్కువ అనే సంభాషణ తో మొదలైన టీజర్ ఆసక్తికరంగా సాగింది. వైద్య వ్యవస్థ నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని టీజర్‌ను బట్టి అర్థమవుతున్నది. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్‌ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రధన్, దర్శకత్వం: సాయిరాజేష్ మహాదేవ్.
