తెలుగమ్మాయి సుమయ రెడ్డి కథానాయికగా నటిస్తున్న చిత్రం డియర్ ఉమ. ఈ సినిమాకు ఆమె కథనందిం చడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నది. పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్నారు. సాయి రాజేష్ మహా దేవ్ దర్శకుడు. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్‌ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైన్ ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీ అంశాతో ఆకట్టుకుంటుంది. ప్రేమ ప్రయాణంలో ఓ జంటకు ఎదురైన అందమైన అనుభూతులకు దర్పణంలా ఉంటుంది. అంతర్లీనంగా చక్కటి సందేశాన్నిస్తుంది అన్నారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, సంగీతం: రధన్, నిర్మాణ సంస్థ: సుమ చిత్ర ఆర్ట్స్, దర్శకత్వం: సాయిరాజేష్ మహాదేవ్.
