Skip to main content

Namaste NRI

సుమయా రెడ్డి ప్రొడక్షన్ నెం. 2 షురూ: డిఫరెంట్ జానర్‌లో మహారాణిలా పోస్టర్ లుక్

తొలి చిత్రం డియర్‌ ఉమతో నటిగా, నిర్మాతగా, రచయితగా ప్రేక్షకుల్ని మెప్పించిన సుమయా రెడ్డి తన రెండో ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమవుతున్నది. సుమచిత్ర ఆర్ట్స్‌ సమర్పణలో సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో నటిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నది. త్వరలో టైటిల్‌ను ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేతి నిండా డబ్బు, బంగారంతో సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్నారు. కామెడీ, హారర్‌ జోనర్‌లో ఇప్పటివరకూ రానటువంటి కథాంశమిదని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, టైటిల్‌ వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events