అమెరికాలోని ఏడాది క్రితం క్యాపిటల్ హిల్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనతో లింకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సమన్లు జారీ చేయనున్నారు. క్యాపిటల్ అటాక్ కేసులో ట్రంప్ను విచారించాలని యూఎస్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు సమన్లు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ రోజు జరిగిన చర్యలపై ట్రంప్ వివరణ ఇవ్వాల్సి ఉందని డెమోక్రాట్ బెన్నీ థామ్సన్ తెలిపారు. ఒకవేళ సమన్లకు ట్రంప్ స్పందించకుంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జైలు శిక్ష కూడా పదే ఛాన్సుంది. 2021 జనవరిలో ఆరో తేదీన క్యాపిటల్ హిల్ పై దాడి జరిగింది. ట్రంప్ మద్దతుదారులు ఆ దాడికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ రెచ్చగొట్టడం వల్ల ఆ దాడి జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ట్రంప్ ఆ చర్యకు దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.














